Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 08:12 AM

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
22-01-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అరైవ్ అలైవ్ మహా ఉద్యమంలో భాగంగా సూర్యాపేటలో భారీ అవగాహన ర్యాలీ

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం భారీ రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పి నరసింహ హాజరై ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, భారీ వాహనాల డ్రైవర్లు, స్థానిక యువత, పౌరులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు.స్థానిక అరవై అడుగుల రోడ్డునుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నళ్ళాభావి సెంటర్, వాణిజ్య భవన్, శంకర్ విలాస్ సెంటర్, ట్యాంక్ బండ్ చౌరస్తా మీదుగా సాగి ఏవీఎం పాఠశాల వద్ద ముగిసింది. అనంతరం ఏవీఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పి నరసింహ మాట్లాడుతూ విద్యార్థులు, డ్రైవర్లను ఉద్దేశించి రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు.

వేగ నియంత్రణ, హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ తప్పనిసరి, మద్యం సేవించి వాహనం నడపకూడదని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక డిఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, రూరల్ సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ సునీత, మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ ఆదిత్య, ఎస్ఐలు సాయిరాం, బాలు నాయక్, ఏడుకొండలు, శివతేజ, మహేందర్, శ్రీకాంత్, మహేష్, ఆటోమొబైల్ షోరూముల సంఘం అధ్యక్షుడు కమలాకర్, పోలీసు సిబ్బంది, ఆర్టీఏ సిబ్బంది, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News