Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:20 PM

రోడ్డు భద్రత మన అందరి బాధ్యత:రాయికోడ్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

19-01-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:రాయికోడ్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో, రాయికోడ్ ఎస్సై చైతన్య కిరణ్ మరియు జహీరాబాద్ గ్రామీణ సీఐ నాయకత్వంలో “ప్రాణాలతో చేరుకుందాం – రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం”ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు ప్రజల్లో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించడం.ఈ సందర్భంగా విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు, ఆటో రిక్షా డ్రైవర్లు, కార్ డ్రైవర్లు మరియు సాధారణ ప్రజలకు రోడ్డు భద్రత నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, నాలుగు చక్రాల వాహనాల్లో సీటు బెల్టు వినియోగించాలి, మద్యం సేవించి వాహనం నడపకూడదు, వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని స్పష్టంగా వివరించారు.అలాగే వేగ నియంత్రణ పాటించడం ఎంత ముఖ్యమో, పాదచారులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి వాహనదారుడిపై ఉందని తెలియజేశారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు హెచ్చరిక జారీ చేశారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు, ప్రాణనష్టానికి దారి తీస్తుందని తెలిపారు.రోడ్డు భద్రత నిబంధనల ఉల్లంఘన చట్టపరమైన చర్యలకు మాత్రమే కాకుండా అమూల్యమైన ప్రాణాల నష్టానికి కారణమవుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా “రోడ్డు భద్రత మన అందరి బాధ్యత” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చని పోలీసులు ప్రజలకు సూచించారు.

Sthanikam

రోడ్డు భద్రత మన అందరి బాధ్యత:రాయికోడ్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News