Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:16 PM

రోడ్డు భద్రత.. చిన్నారుల బాధ్యత!

రోడ్డు భద్రత.. చిన్నారుల బాధ్యత!

రోడ్డు భద్రత.. చిన్నారుల బాధ్యత!
15-04-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి జిల్లాలో ఉత్సాహంగా ‘అరైవ్ అలైవ్’ క్యాంపెయిన్

ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులతో ప్రతిజ్ఞ

తల్లిదండ్రులకు పిల్లల లేఖలు: ‘హెల్మెట్ పెట్టుకో.. క్షేమంగా రా!’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్-2026’ లో భాగంగా బుధవారం చౌటుప్పల్ పట్టణంలో ‘పిల్లల రోడ్డు భద్రత దినోత్సవం’ ఘనంగా నిర్వహించారు. చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో చైతన్య పాఠశాల యాజమాన్యం సహకారంతో విద్యార్థులకు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించారు.​ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

రోడ్డును సురక్షితంగా ఎలా దాటాలి?

స్కూల్ బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు.

స్కూల్ పరిసరాల్లో వాహనాల వేగ నియంత్రణ.

హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.

నాన్నకు ప్రేమతో.. భద్రత లేఖ

​కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు భావోద్వేగపూరితమైన లేఖలు రాశారు. "నాన్నా.. నువ్వు వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించు, సీట్ బెల్ట్ పెట్టుకో.. నీ కోసం మేము ఇంట్లో ఎదురుచూస్తుంటాం" అంటూ పిల్లలు రాసిన లేఖలు అందరినీ ఆలోచింపజేశాయి. అనంతరం విద్యార్థులందరితో కలిసి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ​అనంతరం పట్టణంలో విద్యార్థులు, పోలీసులు కలిసి భారీ మానవహారం, అవగాహన ర్యాలీ నిర్వహించారు. ట్రిపుల్ రైడింగ్‌ను నివారించాలని, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించవద్దని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ విజయ్ మోహన్, ఎస్.ఐ. ఉపేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రత.. చిన్నారుల బాధ్యత!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News