Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

10-03-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- బాధిత కుటుంబానికి రూ.1 లక్ష తక్షణ ఆర్థిక సహాయం

భువనగిరి మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోమవారం వనపర్తి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన తెలిసిందే. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం ఉదయం తిమ్మాపురం గ్రామానికి చేరుకుని మృతుల నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా తన వంతు సహకారంగా రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.ఈ ఘటన పట్ల ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ద్వారా కూడా బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తానని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,గ్రామ శాఖ అధ్యక్షులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

Article Image

- బాధిత కుటుంబానికి రూ.1 లక్ష తక్షణ ఆర్థిక సహాయం

భువనగిరి మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోమవారం వనపర్తి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన తెలిసిందే. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం ఉదయం తిమ్మాపురం గ్రామానికి చేరుకుని మృతుల నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా తన వంతు సహకారంగా రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.ఈ ఘటన పట్ల ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ద్వారా కూడా బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తానని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,గ్రామ శాఖ అధ్యక్షులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News