Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:32 PM

రంజాన్ ఉపవాసంలో ఆధ్యాత్మికత–మానవత్వం సందేశం

22-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో రోజా ఆచరిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని సోమందేపల్లి మండల కేంద్రంలోని జామియా మజీద్లో ఆదివారం రంజాన్ మాసం నాలుగవ రోజా (ఉపవాస దీక్ష)ను ముస్లిం మైనారిటీలు నియమ నిష్ఠలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా మౌలానా ఇలియాజ్ ప్రార్థనల అనంతరం ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఒక్కపూట భోజనం కోసం కూడా కష్టాలు పడుతున్నారని తెలిపారు. మనిషికి ఆకలి విలువను, అన్నం ప్రాముఖ్యతను తెలియజేసేది రోజా అని ఆయన పేర్కొన్నారు.

రంజాన్ ఉపవాసం కేవలం ఆహారం మానుకోవడం మాత్రమే కాదని, మనసును శుద్ధి చేసుకొని దయ, కరుణ, సహానుభూతి వంటి మానవ విలువలను పెంపొందించుకునే పవిత్ర సాధనమని వివరించారు. ఆహారాన్ని వృథా చేయకుండా అవసరమైన వారికి పంచుకోవాలని, అన్నదానం చేయడం ద్వారా సమాజంలో సహకార భావం పెరుగుతుందని పిలుపునిచ్చారు.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక నమాజ్‌లు నిర్వహిస్తూ శాంతి, సామరస్యానికి ప్రార్థనలు చేశారు. రంజాన్ మాసం మానవత్వాన్ని గుర్తుచేసే ఆధ్యాత్మిక సాధనంగా నిలుస్తుందని మత పెద్దలు అభిప్రాయపడ్డారు.

Sthanikam

రంజాన్ ఉపవాసంలో ఆధ్యాత్మికత–మానవత్వం సందేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News