Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడులో వైభవంగా బోనాల పండుగ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:23 AM

రిటైర్ అధికారులకు ఎస్పీ చేతుల మీదుగా ఘన సన్మానం

31-03-2026 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పదవి విరమణ కార్యక్రమంలో ఎస్ఐ మొగులయ్య, ఆర్‌ఎస్‌ఐ ఖదీరుద్దీన్, పీసీ శ్రీనివాస్ రెడ్డి లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో పదవి విరమణ సహజమైనదే అయినప్పటికీ, వారు పోలీసు శాఖకు అందించిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. 1987లో కానిస్టేబుల్‌గా చేరిన మొగులయ్య నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ధైర్యంగా విధులు నిర్వహిస్తూ, ఎలాంటి రిమార్క్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి చేరుకోవడం ఆయన నిబద్ధతకు నిదర్శనం అని పేర్కొన్నారు. 1983లో ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్‌గా చేరిన ఖదీరుద్దీన్ కమాండెంట్ రైటర్, డీఎస్పీ రైటర్, ఆర్‌ఐ రైటర్ వంటి బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వహిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుని ఆర్‌ఎస్‌ఐ హోదాకు ఎదగడం విశేషమన్నారు. 1993లో కానిస్టేబుల్‌గా చేరిన శ్రీనివాస్ రెడ్డి సాధారణ విధులతో పాటు రైల్వే విభాగంలో కూడా సమర్థవంతంగా సేవలందించి మంచి గుర్తింపు పొందారని తెలిపారు. ఈ ముగ్గురు అధికారులు అందించిన సేవలు మారువలేనివని కొనియాడుతూ, రిటైర్మెంట్ అనంతరం వారికి రావలసిన అన్ని బెనిఫిట్స్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే వారు ఆరోగ్యంగా ఉండి కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కళ్యాణి, ఎఆర్ డీఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, సదా నాగరాజు, ప్రవీణ్ రెడ్డి, నాగేశ్వర్ రావు, ఆర్‌ఐలు రాజశేఖర్, డానియెల్, సురేష్ మరియు రిటైర్ అవుతున్న అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

రిటైర్ అధికారులకు ఎస్పీ చేతుల మీదుగా ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News