Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

రికార్డు స్థాయిలో బాల కార్మికుల విముక్తి ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్

03-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రికార్డు స్థాయిలో బాల కార్మికుల విముక్తి

జనవరిలో 92 కేసుల్లో 118 మంది చిన్నారుల రక్షణ

తల్లిదండ్రులకు అప్పగింత – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్

పలకా–బలపం పట్టి బడిబాట పట్టాల్సిన పసిపిల్లలు వెట్టిచాకిరీ బంధనాల్లో చిక్కుకుపోకుండా నల్లగొండ జిల్లా పోలీసులు విశేష కృషి చేశారు. ఒక్క జనవరి నెలలోనే 92 కేసుల్లో 118 మంది బాల కార్మికులను రికార్డు స్థాయిలో రెస్క్యూ చేసి వారి భవితవ్యం అంధకారంలో మునిగిపోకుండా కాపాడినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ… కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ‘ఆపరేషన్ స్మైల్’, ‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. వీటి ద్వారా బాల కార్మికులు, వీధి బాలలు, ఇటుక బట్టీల్లో బంధీ కార్మికులు, ముష్టి మాఫియా చేతుల్లో చిక్కుకున్న పిల్లలు, పరిశ్రమల్లో అక్రమంగా పని చేస్తున్న చిన్నారులను రక్షిస్తున్నామని వివరించారు.

నల్లగొండ జిల్లా పరిధిలోని మూడు సబ్ డివిజన్లలో జిల్లా ఎస్పీ నేతృత్వంలో అడిషనల్ ఎస్పీ రమేష్, పోలీస్ శాఖ ఏహెచ్టీయూ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించామని తెలిపారు.

రెస్క్యూ చేసిన 118 మందిలో 105 మంది బాలురు, 13 మంది బాలికలు ఉండగా, వీరిలో ఎక్కువ మంది బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించినట్లు వెల్లడించారు. చిన్నారులకు కౌన్సిలింగ్ ఇచ్చి, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న అనంతరం తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు.బాల కార్మికులతో పని చేయించుకుంటే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాల కార్మికులు లేదా వీధి బాలలు కనిపిస్తే వెంటనే డయల్–100, 1098 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.ఈ ఆపరేషన్‌లో సమర్థవంతంగా పనిచేసిన ఏహెచ్టీయూ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులను జిల్లా ఎస్పీ అభినందిస్తూ వారికి రివార్డులు ప్రకటించారు.

Sthanikam

రికార్డు స్థాయిలో బాల కార్మికుల విముక్తి ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News