Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

రేపు కలెక్టర్ కార్యాలయంలో పి జి ఆర్ ఎస్

రేపు కలెక్టర్ కార్యాలయంలో పి జి ఆర్ ఎస్

రేపు కలెక్టర్ కార్యాలయంలో పి జి ఆర్ ఎస్
22-02-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ఈ నెల 23న సోమవారం ఉదయం శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు ఆదివారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

అర్జీదారులు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టరేట్ కు వచ్చే అవసరం లేకుండా "meekosam.ap.gov.in" లో ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చునన్నారు. దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో ప్రస్తుత సమాచారం ఆన్లైన్లో తెలుస్తుందని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1100 ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు.

అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత మండల, డివిజన్, మున్సిపాలిటీలలో అధికారులకు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. మండల, డివిజన్ స్థాయిలలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాగలరని తెలిపారు. కలెక్టరేట్లో జరిగే పిజిఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.

Sthanikam

రేపు కలెక్టర్ కార్యాలయంలో పి జి ఆర్ ఎస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News