Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశలు ఆందోళన

Updated : 31 Mar 2026 21:03 IST
As Preferred Source 1 min read
రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశలు ఆందోళన

రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశలు ఆందోళన

కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ మేరకు రూ.18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని,ఉద్యోగ భద్రత, హెల్త్ ఇన్సూరెన్స్,ప్రమాద బీమా,ప్రసూతి సెలవులు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళనలో

భాగంగా మంగళవారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల పీ.హెచ్.సీ పరిధిలోని ఆశాలు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా పలువురు ఆశాలు మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని,అలా చేయనంతవరకు సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ప్రస్తుతం ఆశా వర్కర్లకు ఇన్సెంటివ్ ఆధారంగా సుమారు రూ.9,900 మాత్రమే అందుతోందని,అది కూడా సకాలంలో రావడం లేదని, కనీస వేతనం కూడా లభించడం లేదని ఆరోపించారు.“మేము గ్రామీణ,పేదల ఆరోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నామని, మాతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఉద్యోగ భద్రత,హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా,ప్రసూతి సెలవులు లేకుండా,అదనపు

పనులు,రికార్డులు,ఆన్లైన్ అప్లోడింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి

ఆశాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ భద్రత, హెల్త్ ఇన్సూరెన్స్,ప్రమాద బీమా,ప్రసూతి సెలవులతో పాటు సబ్ సెంటర్ డ్యూటీల

వంటి ,పని వత్తిడి తగ్గించి, రూ.18000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ లీడర్లు జి.భాగ్యలక్ష్మి,సుధారాణి, నాగమణి,మయూరి,భారతి, అరుణ,అలివేలు,జ్యోతి, రమణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశలు ఆందోళన

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news