Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:06 PM

రెండు ఏళ్లుగా శుభ్రం కాని వాటర్ ట్యాంక్

రెండు ఏళ్లుగా శుభ్రం కాని వాటర్ ట్యాంక్

రెండు ఏళ్లుగా శుభ్రం కాని వాటర్ ట్యాంక్
10-02-2026 307 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తాడు సహాయంతో ఎక్కి శుభ్రం చేసిన పంచాయతీ సిబ్బంది

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నాల గ్రామంలో తాగునీటి వాటర్ ట్యాంక్ నిర్వహణలో జరిగిన తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. గత రెండు సంవత్సరాలుగా ట్యాంక్‌ను శుభ్రం చేయకపోవడంతో లోపల భారీగా ఇసుక, మట్టి పేరుకుపోయినట్లు తేలింది.మెట్లు వంటి భద్రతా సౌకర్యాలు లేకపోయినా గ్రామపంచాయతీ సిబ్బంది నోముల శంకరయ్య ఒక తాడు సహాయంతో ట్యాంక్‌పైకి ఎక్కి శుభ్రపరిచే పనులు చేపట్టారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన ఈ చర్య పంచాయతీ నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్లుగా గ్రామంలో చర్చకు దారితీసింది.తాగునీటి ట్యాంక్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాల్సిన బాధ్యత ఉన్నా, రెండేళ్లుగా పట్టించుకోకపోవడం ప్రజారోగ్యంపై ముప్పుగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తాగునీటి సరఫరా వ్యవస్థపై అధికారులు దృష్టి సారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

రెండు ఏళ్లుగా శుభ్రం కాని వాటర్ ట్యాంక్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News