Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:39 AM

రెండవ రోజు కొనసాగిన త్రాగునీటి కార్మికుల ధర్నా

07-05-2026 125 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో సత్యసాయి తాగునీటి కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం రెండవ రోజుకు చేరుకుంది. ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు తమ విధులను బహిష్కరించి, కొత్తచెరువు పంప్ హౌస్ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. ఈ సమ్మెకు ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ మద్దతు తెలిపారు. బుధవారం కార్మికులతో కలిసి ఆయన దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఈఎస్ వెంకటేష్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి కార్మికుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలు రాత్రి తేడా లేకుండా పనిచేసే కార్మికులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కుటుంబాలను పోషించుకోవడానికే ఇబ్బంది పడే పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. అలాగే గత ఏడాది బడ్జెట్లో సత్యసాయి నీటి పథకానికి కేటాయించిన 36 కోట్లలో కేవలం 13 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం, ఈ ఏడాది బడ్జెట్లో మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

Sthanikam

రెండవ రోజు కొనసాగిన త్రాగునీటి కార్మికుల ధర్నా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News