Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:12 PM

ర్యాలమడుగులో సంక్షేమ కార్యక్రమాలు – ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం,సీసీ రోడ్డు శంకుస్థాపన

04-02-2026 284 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోనిజాంపేట్ మండలం ర్యాలమడుగు గ్రామానికి చెందిన లక్ష్మి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశోత్సవ కార్యక్రమంలో నేడు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదలకు స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్నామని తెలిపారు.పేదలు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని ఆయన అన్నారు.ర్యాలమడుగు గ్రామానికి చెందిన లక్ష్మికి ఇందిరమ్మ ఇంటి మంజూరు జరిగి, నేడు గృహప్రవేశం జరగడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇసుకను ఉచితంగా అందించడంతో పాటు రుణ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని, అర్హులైన పేదలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు,ర్యాలమడుగు గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ర్యాలమడుగులో సంక్షేమ కార్యక్రమాలు – ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం,సీసీ రోడ్డు శంకుస్థాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News