Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:06 PM

రాష్ట్రంలో రోడ్డు భద్రతకు పోలీసుల ముందడుగు – ప్రజల్లో అవగాహన

20-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండల పరిధిలోని సింగితం గ్రామ చౌరస్తాలో మంగళవారం జిల్లా ఎస్పీ పంకజ్ పారితోష్, అదనపు ఎస్పీ రఘునందన్ రావు, జహీరాబాద్ డిఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు ఆదేశాల మేరకు రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరణ్ మరియు అతని సిబ్బంది ఆధ్వర్యంలో “రాజ్య రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం” విజయవంతంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు ప్రజల్లో రోడ్డు నియమాలపై అవగాహన కల్పించడం. కార్యక్రమంలో విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు మరియు సాధారణ ప్రజలకు రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాల గురించీ అవగాహన కల్పించబడింది. ముఖ్యంగా హెల్మెట్ ధరించడం తప్పనిసరి, సీట్ బెల్ట్ ఉపయోగించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదు, డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడకూడదు, వేగ నియంత్రణ పాటించాలి, పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలి వంటి విషయాలపై వివరించారు.అలాగే, మైనర్ పిల్లలకు వాహనాలను అందించడం ప్రమాదకరమని తల్లిదండ్రులకు హెచ్చరిక జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చట్టపరమైన చర్యలకు మాత్రమే కాకుండా ప్రాణనష్టానికి కూడా దారి తీస్తుందని అధికారులు తెలియజేశారు.ఈ కార్యక్రమం ద్వారా “రోడ్డు భద్రత – మన అందరి బాధ్యత” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చారు. రోడ్డు భద్రత నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించి, విలువైన ప్రాణాలను కాపాడవచ్చని పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు.

Sthanikam

రాష్ట్రంలో రోడ్డు భద్రతకు పోలీసుల ముందడుగు – ప్రజల్లో అవగాహన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News