Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:14 PM

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు

09-02-2026 374 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునుగోడు గడ్డ మరోసారి తెలంగాణ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారుతోంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఘాటైన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి.“తెలంగాణ రాజకీయాలను శాసించే రోజు మునుగోడు నుంచే మొదలవుతుంది. మునుగోడు ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రాన్ని శాసించే రోజు తప్పక వస్తుంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ప్రత్యేక రాష్ట్రం సాధించినప్పటికీ సామాన్య ప్రజల సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారమవలేదని రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. “రాష్ట్రం వచ్చింది… కానీ ప్రజల కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. రైతు, నిరుద్యోగి, పేదవాడి జీవితంలో ఆశించిన మార్పు కనిపించడం లేదు” అంటూ పాలక వ్యవస్థపై పరోక్ష విమర్శలు చేశారు.మునుగోడు ఉపఎన్నికల సమయంలో రాష్ట్ర రాజకీయాల దిశ మారిన తీరు రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఇప్పుడు మరోసారి అదే తరహా రాజకీయ మలుపు మునుగోడు నుంచి ప్రారంభమవుతుందా అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది.రాబోయే రోజుల్లో మునుగోడు రాజకీయాలు రాష్ట్ర స్థాయిలో కీలక మలుపు తిప్పే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలను కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇస్తున్నాయి. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్ష శిబిరాల్లో కలకలం రేపుతున్నాయి.

Sthanikam

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News