Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:56 PM

రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఎంబడి దత్తు రెడ్డి

20-02-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాల్గవ మహాసభలు నిజామాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రతినిధులు, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు హాజరై సంస్థ భవిష్యత్ దిశ, విద్యా విధానాలు, విద్యార్థుల సమస్యలపై విస్తృతంగా చర్చలు జరిపారు.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా నుండి దత్తు రెడ్డి గారిని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.నాపై రాష్ట్ర నాయకత్వం మరియు ప్రతినిధులు ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనం. జిల్లాలో విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేయడంలో, విద్యార్థుల హక్కుల సాధనలో దత్తు రెడ్డి గారు చూపుతున్న చురుకుదనం, నిబద్ధత, పోరాట పటిమకు గుర్తింపుగా ఈ బాధ్యతను ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా దత్తు రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఎన్నుకున్న రాష్ట్ర నాయకత్వానికి మరియు మహాసభ ప్రతినిధులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ బాధ్యతను ఒక గౌరవంగా కాకుండా, మరింత బాధ్యతగా స్వీకరిస్తున్నాను. సంగారెడ్డి జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు — ఫీజుల భారం, హాస్టల్ సౌకర్యాల లోపం, స్కాలర్‌షిప్ సమస్యలు, ఉపాధ్యాయుల కొరత, ప్రైవేటీకరణ ప్రభావం వంటి అంశాలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తాము. విద్య హక్కు — అమ్మకం కాదు అనే నినాదంతో ముందుకు సాగుతాము” అని పేర్కొన్నారు.అలాగే, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు కల్పించడం, ప్రతి విద్యార్థి స్వరాన్ని ప్రభుత్వానికి వినిపించేలా ఉద్యమాలను మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.ఈ ఎన్నికతో సంగారెడ్డి జిల్లాలో ఏఐఎస్ఎఫ్ కార్యకలాపాలు మరింత చురుకుగా మారనున్నాయని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు గౌరవం తీసుకువచ్చిన దత్తు రెడ్డి గారికి జిల్లా నాయకులు, కార్యకర్తలు మరియు విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఎంబడి దత్తు రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News