Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:27 AM

రాష్ట్ర గవర్నర్ మట్టపల్లి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

21-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం మట్టపల్లి పుణ్యక్షేత్రానికి మంగళవారం రానున్న నేపథ్యంలో, గవర్నర్ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బుధవారం మట్టపల్లిలో గవర్నర్ రాకకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పర్యవేక్షించారు. గవర్నర్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను, ఆలయ ధర్మకర్తలను సూచించారు. పోలీస్ శాఖ హెలిప్యాడ్ ఏర్పాట్లు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ పండితులు, ధర్మకర్తలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కే. నరసింహ, అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లి రావు, విజయ్ కుమార్, ఆలయ ఈవో జ్యోతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాష్ట్ర గవర్నర్ మట్టపల్లి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News