శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని ప్రాచీన రామ మందిరంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఆలయం అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై రాములవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్, ఆయన సతీమణి మాలదేవి షేట్కార్ దంపతులు ఆలయానికి విచ్చేసి రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద, బాణపురం రాజు, గోపాల్ రెడ్డి, కొండల్ రెడ్డి, పాండు,రాజు షెట్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
PRINT TIME: August 31, 2026 12:34 PM
రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ దంపతులు

27-03-2026
121 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని ప్రాచీన రామ మందిరంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఆలయం అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై రాములవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్, ఆయన సతీమణి మాలదేవి షేట్కార్ దంపతులు ఆలయానికి విచ్చేసి రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద, బాణపురం రాజు, గోపాల్ రెడ్డి, కొండల్ రెడ్డి, పాండు,రాజు షెట్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి