Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:27 AM

రామన్నపేటలో సార్వత్రిక సమ్మె విజయవంతం

రామన్నపేటలో సార్వత్రిక సమ్మె విజయవంతం

రామన్నపేటలో సార్వత్రిక సమ్మె విజయవంతం
February 12, 2026 04:57 PM 122 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న మోడీ విధానాలు

రామన్నపేట.

కేంద్ర ప్రభుత్వ ప్రజా–కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె రామన్నపేట మండల కేంద్రంలో విస్తృతంగా జరిగింది. సీఐటీయూ మరియు ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మెలో అనేక రంగాల కార్మికులు పాల్గొని అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగె సోములు మాట్లాడుతూ దేశ భవిష్యత్తును కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతూ కార్మిక, కర్షక వర్గాల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యం ఇస్తూ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. స్కీమ్ వర్కర్లు తక్కువ వేతనాలతో పని చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం ద్వారా కార్మిక హక్కులను బలహీనపరిచారని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే పోరాటాలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడం కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు బొడ్డుపల్లి వెంకటేశం, నకిరేకంటి రాము, మామిడి వెంకట్ రెడ్డి, వనం ఉపేందర్, బలుగూరి అంజయ్య, గురుకు లలిత, కందుల హనుమంతు, బోయిని ఆనంద్, బావండ్లపల్లి బాలరాజు, గాదె కృష్ణ, గాదె ఎల్లయ్య, మునికుంట్ల లెనిన్, బుడ్డా ప్రసాద్, శానగొండ రాము, మెట్టు శ్రవణ్ కుమార్, గుండాల ప్రసాద్, గోగు లింగస్వామి, మొటే అంజయ్య, చిట్టి మల్ల శేఖర్, మేడి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News