Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మానవత్వం చాటిన స్థానికం దినపత్రిక ఎడిటర్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 12:23 PM

రామన్నపేట మండలంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటన. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం.

రామన్నపేట మండలంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటన. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం.

రామన్నపేట మండలంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటన. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం.
April 14, 2026 10:01 AM 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎంఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం సోమవారం ప్రారంభించారు. ముందుగా మండల కేంద్రంలో రైతుల సౌకర్యార్థం శుద్ధి చేసిన తాగునీటి ప్లాంట్‌ను ప్రారంభించి, అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

తదుపరి జనంపల్లి, ఇస్కిల్ల, కక్కిరేణి, ఎన్నారం, కుంకుడుపాముల, తుర్కపల్లి, సూరారం, బాచ్చుపల, పల్లివాడ, మునిపంపుల, దుబ్బాక, నీర్నేముల, సిరిపురం, వెల్లంకి, సర్నేనిగూడెం గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని సులభంగా విక్రయించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

వెల్లంకి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహంలో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లాల్ బహదూర్, ఎంపీడీవో ఏ రాములు, వ్యవసాయ అధికారి ఎజాజ్ అలీఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ భూక్యా నాయక్, వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, ఏపీఎం ఎస్.కె. జానీమియా, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News