Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:28 AM

రామన్నపేట లో 64 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల

14-05-2026 122 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 64 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల చెక్కులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.1,00,116 ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి, ఎంపీడీఓ, తహసీల్దార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట లో 64 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల

Article Image

రామన్నపేట: మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 64 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల చెక్కులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.1,00,116 ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి, ఎంపీడీఓ, తహసీల్దార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News