Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:35 AM

రామన్నపేట డిగ్రీ కళాశాలలో ఘనంగా మానవ హక్కుల దినోత్సవం

10-12-2025 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని బుధవారం సామాజిక శాస్త్రాల విభాగాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రహత్ ఖానం మాట్లాడుతూ, “ప్రపంచ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 10ని మానవ హక్కుల దినోత్సవంగా ప్రకటించింది. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి స్వేచ్ఛగా తమ హక్కులను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. అదే సమయంలో ఇతరుల హక్కులకు భంగం కలగకుండా వ్యవహరించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని పేర్కొన్నారు. అంతేకాక, మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలను అమలు చేస్తోందని ఆమె వివరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఎన్ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు ఎం. అనిత, టి. శ్రీనివాసులు, అలాగే అధ్యాపకులు డాక్టర్ కిషన్, డాక్టర్ లక్ష్మినీలిమ, డాక్టర్ సునీత, డాక్టర్ బ్రహ్మం, డాక్టర్ రాచమల్ల శ్రీను, జి. నరేష్, ఏ. ఆంజనేయులు, రాధిక తదితర అధ్యాపక–అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ–విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట డిగ్రీ కళాశాలలో ఘనంగా మానవ హక్కుల దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News