మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భక్తి భావాన్ని చాటుకుంటూ చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న రామాలయ గుడికి రూ.1 లక్ష విరాళం ప్రకటించారు.
గ్రామాల్లో ఆధ్యాత్మిక, సామాజిక ఐక్యతకు దేవాలయాలు కేంద్రబిందువులుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన సేవాభావాన్ని అభినందించారు. గ్రామస్థుల నుంచి కూడా ఈ చర్యకు మంచి స్పందన వ్యక్తమవుతోంది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి