Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:31 PM

రక్తదానం మహాదానం – నారాయణఖేడ్‌లో మెగా రక్తదాన శిబిరం విజయవంతం

27-03-2026 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రక్త నిల్వలు కొరత ఏర్పడిన నేపథ్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణాలను కాపాడే మహోన్నత సేవ అని,ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి దాతకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులు,మ్యాన్స్ క్లబ్ టీమ్ మరియు ఆసుపత్రి సిబ్బందిని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.ఈ శిబిరంలో మొత్తం 52 మంది దాతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో సాయి సంగమేశ్వర సెట్,లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాజ్ కుమార్, చంద్రశేఖర్ ఆచార్య,వెంకట్ రావు, ఆసుపత్రికి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్,తదితర సభ్యులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

రక్తదానం మహాదానం – నారాయణఖేడ్‌లో మెగా రక్తదాన శిబిరం విజయవంతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News