Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:08 PM

రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
21-05-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనదే: ఇంద్రసేనారెడ్డి

భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 36వ వర్థంతి సందర్భంగా రాజీవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ స్మారక భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆధునిక భారత నిర్మాణ శిల్పిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు సాంకేతిక విప్లవానికి నాంది పలికి కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. యువతకు రాజకీయ హక్కులు కల్పించేందుకు 21 ఏళ్ల వయస్సు నుండి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా రాజీవ్ గాంధీకే దక్కుతుందని పేర్కొన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, దూరదృష్టి కలిగిన నాయకుడని ఇంద్రసేనారెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, రాజీవ్ ట్రస్ట్ ఉపాధ్యక్షులు జింద్రు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.ఏ ఖయ్యూం, కార్యదర్శి నల్ల నరసింహ, నాయకులు చింతల సాయిలు, ఆవుల యేసుదాసు, కంచర్ల జంగయ్య, మాదని గోపాల్, బండమీది ఎల్లయ్య, ఎండీ చాంద్ పాషా, ముత్యాల గణేష్, ఉదరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News