Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:19 AM

రాజమండ్రిలో కల్తీ పాల కలకలం – నలుగురు మృతి, పలువురు ఆస్పత్రిపాలు

23-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రాజమండ్రిలో కల్తీ పాల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పది కుటుంబాలకు చెందిన పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ విషయంపై సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీ. హరినాథ్ తీవ్రంగా స్పందించారు. విస్సన్నపేటలో ఆయన మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన కల్తీ ఆహార పదార్థాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

కల్తీ పాలు కారణంగా కుటుంబాలు వీధిన పడిన పరిస్థితి దురదృష్టకరమని, ఈ ఘటనపై సంబంధిత శాఖలు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే పరామర్శించి, సమగ్ర సహాయం అందించాలని కోరారు.

మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన ఆర్థిక సహాయం సరిపోదని పేర్కొంటూ, ఆధారం కోల్పోయిన కుటుంబాలకు మరింత పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు.

కల్తీ పాల తయారీ, సరఫరా చేస్తున్న దుర్మార్గులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Sthanikam

రాజమండ్రిలో కల్తీ పాల కలకలం – నలుగురు మృతి, పలువురు ఆస్పత్రిపాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News