Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:45 AM

రాజకీయాల్లో కొత్త మలుపు? జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

03-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారిన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి . ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, వచ్చే రెండేళ్లలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెళ్లిపోవాలని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ, తన భవిష్యత్‌ రాజకీయ దిశపై కీలక నిర్ణయం తీసుకునే దశలో ఉన్నానని తెలిపారు. “ఏ పార్టీలో చేరాలో వారం రోజుల్లో స్పష్టంగా ప్రకటిస్తాను” అని పేర్కొన్నారు. తన నిర్ణయం వ్యక్తిగతంగా కాకుండా, అభిమానులు, మిత్రులు, అనుచరుల అభిప్రాయాల మేరకే ఉంటుందని వెల్లడించారు.

గత రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో మార్పు కోసం ఒకప్పుడు కేసీఆర్‌ ఓడిపోవాలని కూడా కోరుకున్నానని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అదే మార్పు కోసం మరోసారి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు.జీవన్‌ రెడ్డి తాజా వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన తదుపరి అడుగు ఏ దిశలో ఉంటుందో అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.

Sthanikam

రాజకీయాల్లో కొత్త మలుపు? జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News