Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:43 PM

రాజకీయాల్లో నవ విప్లవం రావాలి

రాజకీయాల్లో నవ విప్లవం రావాలి

రాజకీయాల్లో నవ విప్లవం రావాలి
28-01-2026 180 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

యువతకు, మహిళలకు పెద్దపీటతో జాగృతి అడుగులు

కప్పాటి పాండురంగారెడ్డి పిలుపు

స్థానికం ప్రతినిధి

సమాజంలో నిజమైన మార్పు రావాలంటే సంకల్పం, సేవాభావం కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జాగృతి నాయకులు కుమ్మరి శివశంకర్, ఉండెల బాబురావుతో కలిసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన స్పందించారు.ఒకప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు ఉండేవని, నేటి రోజుల్లో అవి క్రమంగా కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తరం మారుతున్న కొద్దీ కొత్త ఆలోచనలు, కొత్త ఆకాంక్షలు కలిగిన యువత రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరమని అన్నారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా పనిచేసే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించినప్పుడే భవిష్యత్ తెలంగాణకు బలమైన పునాదులు వేయగలమని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ విధానం ద్వారానే సామాజిక విప్లవం సాధ్యమని నమ్మి, కల్వకుంట్ల కవిత నేతృత్వంలో జాగృతిని రాజకీయ వేదికగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఈ నూతన ప్రస్థానంలో యువతకు పెద్దపీట వేస్తూ, మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ, ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు.రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించి, చరిత్రలో నిలిచిపోయేలా పనిచేయాలనే కృతనిశ్చయంతో జాగృతి ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ సామాజిక, రాజకీయ యజ్ఞంలో యువత పెద్దఎత్తున భాగస్వాములు కావాలని కప్పాటి పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు.

Sthanikam

రాజకీయాల్లో నవ విప్లవం రావాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News