Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:44 PM

రైతులు ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలి

రైతులు ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలి

రైతులు ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలి
April 08, 2026 04:18 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఐకెపి కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని తహసిల్దార్ హేమలత అన్నారు. బుధవారం వేములపల్లి మండల కేంద్రంలోని ఆమనగల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ పిల్లల సందీప్, లక్ష్మీదేవి గూడెం సర్పంచ్ ఎలికంటి భరత్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.రైతులు దళారులు నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం రైతులకు ఏ రకం ధాన్యానికి 2389 రూపాయలు, సాధారణ ధాన్యం రకానికి 2369 రూపాయలు అందించి కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కొనుగోలు కేంద్రం సాఫీగా జరిగేటట్లు రైతులు సహకరించాలని కోరారు. రైతులు ధాన్యాన్ని తీసుకు వచ్చేటప్పుడు తేమ శాతం 17 కంటే ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో డిపిఎం సోమయ్య, ఎపిఎం జానకి, ఆర్ ఐ మహేందర్ రెడ్డి,ఏ ఈ ఓ రమేష్, సీసీ గోపి,ఉప సర్పంచ్లు శాలెం రాజు, గంట స్వాతి నరసయ్య, రాష్ట్ర ఐ ఎన్ టి యు సి ఆర్గనైజింగ్ కార్యదర్శి బంటు చొక్కాయ్య గౌడ్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పత్తిపాటి స్వరాజ్యలక్ష్మి, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, ఐకెపి నిర్వాహకులు కుంచం నాగమణి, హమాలి సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News