Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:28 AM

రైతులను నిలువుదోపిడీ చేస్తున్న ప్రభుత్వం. వడ్ల కొనుగోలులో మిల్లర్ల ఇష్టారాజ్యం: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్

22-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హుస్నాబాద్,

వడ్ల కొనుగోలులో రైతులను నిలువుదోపిడీ చేస్తూ ప్రభుత్వం చోద్యం చూస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ విమర్శించారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని ప్రాథమిక సహకార సంఘం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందన్నారు. జిల్లావ్యాప్తంగా వడ్ల కొనుగోలు ప్రక్రియ నిర్లక్ష్యంగా కొనసాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదన్నారు. రెండు నెలలుగా ధాన్యం మార్కెట్ యార్డుల వద్దే నిల్వ ఉండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

రైస్ మిల్లర్లు ఒక్క లారీ దిగుమతికి ఆరు రోజుల సమయం తీసుకుంటుండటంతో లారీల కొరత ఏర్పడి కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. వడ్ల కొనుగోలులో మిల్లర్ల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతుల సమస్యలను సిపిఎం బృందం ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లినట్లు చెప్పారు.

జిల్లాలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు రాజకీయ నాయకుల్లా ప్రకటనలు చేయడం తప్ప చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కొనుగోళ్లు నిలిచిపోవడంతో వాతావరణ మార్పుల కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. జిల్లాలోని అన్ని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నదన్నారు.

రైస్ మిల్లర్లు తమ వైఖరి మార్చుకుని లారీల కొరత లేకుండా చూడాలని, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు వనం రాజు, పట్టణ కమిటీ సభ్యులు వల్దాస్ అంజయ్య, బర్ల వెంకటేష్, నాయకులు వల్దాస్ వెంకటేష్, బండి రవి, రైతులు నరాల బాల నర్సమ్మ, కుచ్చుల హనుమంతు, కుచ్చుల బాలయ్య, జంగప్ప, నరసింహ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులను నిలువుదోపిడీ చేస్తున్న ప్రభుత్వం. వడ్ల కొనుగోలులో మిల్లర్ల ఇష్టారాజ్యం: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News