Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు.. 31లోగా దరఖాస్తు చేసుకోవాలి:జిల్లా అదనపు కలెక్టర్ పాండు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:32 PM

రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమం

రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమం

రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమం
04-02-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

చీడపీడల నివారణపై కీలక సూచనలు

కూసుమంచి:

కూసుమంచి మండలంలోని పలు గ్రామాలలో వ్యవసాయ అధికారులు పంట పొలాలను పరిశీలించి రైతులకు విస్తృత అవగాహన కల్పించారు. స్థానిక వ్యవసాయ అధికారి కూసుమంచి జనార్దన్ రావు నేతృత్వంలో సాగిన ఈ కార్యక్రమంలో రైతుల సమస్యలను నేరుగా తెలుసుకొని తగిన సూచనలు చేశారు.కూసుమంచి మండలంలోని మల్లేపల్లి గ్రామంలో వరి పొలాలను కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సతీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పంటలకు వచ్చే చీడపీడలు, వాటి నివారణ పద్ధతులు, తగిన మందుల వినియోగంపై అవగాహన కల్పించారు. పంట స్థితిని బట్టి సమయానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం కిశ్రాపురం గ్రామంలో నిర్వహించిన రైతుల సమావేశంలో రైతు నమోదు ప్రక్రియ, యూరియా బుకింగ్ విధానం, పంట నమోదు ప్రాధాన్యతపై స్పష్టంగా వివరించారు. రైతులు తప్పనిసరిగా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని, తద్వారా ప్రభుత్వ సహాయ పథకాలు సులభంగా అందుతాయని తెలిపారు.తదుపరి కిష్టాపురం గ్రామంలో పంట పొలాలను పరిశీలించి రైతులకు వ్యక్తిగతంగా సలహాలు ఇచ్చారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలలో జింకులోపం కనిపిస్తున్నట్లు గుర్తించి, జింక చలిపేట గ్రామాన్ని పిచికారీ చేసుకోవాలని సూచించారు. పంట ఆరోగ్యం కాపాడుకోవాలంటే పోషక లోపాలను వెంటనే సరిచేయాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, వ్యవసాయ విస్తరణ అధికారులు జానీ బాబా, వంశీకృష్ణతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News