Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:27 AM

రైతులకు ఇబ్బందులు కలగొద్దు. అధికారులకు ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల వీరేశం

24-05-2026 184 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

28లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.

కేతపల్లి, నకిరేకల్‌, కట్టంగూర్ మండలాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 28వ తేదీలోపు పూర్తిచేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్‌ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు.

నకిరేకల్‌ ఎంఆర్వో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మూడు మండలాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు అంశంపై అధికారులతో చర్చించారు. మొత్తం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 23 సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మిగిలిన అన్ని కేంద్రాల్లో కూడా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, మార్కెట్ చైర్‌పర్సన్ గుత్తా మంజుల, మాధవ్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులకు ఇబ్బందులు కలగొద్దు. అధికారులకు ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

28లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.

కేతపల్లి, నకిరేకల్‌, కట్టంగూర్ మండలాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 28వ తేదీలోపు పూర్తిచేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్‌ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు.

నకిరేకల్‌ ఎంఆర్వో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మూడు మండలాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు అంశంపై అధికారులతో చర్చించారు. మొత్తం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 23 సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మిగిలిన అన్ని కేంద్రాల్లో కూడా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, మార్కెట్ చైర్‌పర్సన్ గుత్తా మంజుల, మాధవ్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News