Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:30 PM

రైతులకు భారీ ఊరట – 3,600 కోట్లు ఖాతాల్లో జమ

24-03-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహించిన ‘రైతు భరోసా’ నిధుల విడుదల కార్యక్రమం ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయంగా రూ. 3,600 కోట్ల నిధులను నేరుగా జమ చేశారు.ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగంలో ఆనందం వెల్లివిరిసింది. సాగు ఖర్చులకు ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయం బలోపేతం చేయడం, రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.అదేవిధంగా, వచ్చే 45 రోజుల్లోగా మొత్తం రూ. 9,000 కోట్ల నిధులను రైతులందరి ఖాతాల్లో జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో రైతులకు నిరంతర సహాయం అందించాలన్న ప్రభుత్వ సంకల్పం మరింత స్పష్టమైంది.ఈ కార్యక్రమం అనంతరం నారాయణఖేడ్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి సహచర ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, రైతులకు అందిస్తున్న సహాయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు రైతాంగానికి పెద్ద భరోసాగా నిలుస్తాయని వారు అభిప్రాయపడ్డారు.

Sthanikam

రైతులకు భారీ ఊరట – 3,600 కోట్లు ఖాతాల్లో జమ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News