Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

రైతుల శ్రమ తగ్గించడమే లక్ష్యంగా వ్యవసాయ యాంత్రికరణ పథకం అమలు

Updated : 20 Jan 2026 17:58 IST
As Preferred Source 1 min read
రైతుల శ్రమ తగ్గించడమే లక్ష్యంగా వ్యవసాయ యాంత్రికరణ పథకం అమలు

ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని వ్యవసాయ శాఖ అధికార కార్యాలయంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రికరణ పథకంలో భాగంగా రైతులకు సబ్సిడీ ద్వారా వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల శ్రమను తగ్గించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తి పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తున్న వ్యవసాయ పనిముట్లు నాణ్యమైనవని, ఎక్కువకాలం ఉపయోగపడే విధంగా ఉంటాయని చెప్పారు. ప్రతి రైతు కూడా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు.నారాయణఖేడ్ నియోజకవర్గానికి మొత్తం 109 వ్యవసాయ పనిముట్లు మంజూరు కాగా, వాటిలో కల్టివేటర్లు 21, స్ప్రేయర్లు 77, బ్రష్ కట్టర్లు 3, పవర్ విడర్లు 1, రోటవేటర్లు 4, విత్తనాలు మరియు ఎరువులు వేసే డ్రిల్ 1, ధాన్యాన్ని కట్టే యంత్రం 1 ఉన్నాయి. ఈ పనిముట్ల పంపిణీతో నియోజకవర్గంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు నూతన్ కుమార్, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు దారం శంకర్ సెట్, రైతులు మరియు ఇతర ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

రైతుల శ్రమ తగ్గించడమే లక్ష్యంగా వ్యవసాయ యాంత్రికరణ పథకం అమలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news