Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:29 AM

రైతుల సమస్యలు పరిష్కరించాలి. తాసిల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన

19-05-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్వో కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎంఆర్వోకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన” అంటూ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వైయంతి, సుర్వి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడుత భాస్కర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నపురం శ్రీశైలం, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాలశంకర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జనగాం కవిత, బెజ్జెంకి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతుల సమస్యలు పరిష్కరించాలి. తాసిల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన

Article Image

: రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్వో కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎంఆర్వోకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన” అంటూ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వైయంతి, సుర్వి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడుత భాస్కర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నపురం శ్రీశైలం, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాలశంకర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జనగాం కవిత, బెజ్జెంకి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News