Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:21 AM

రైతుల కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది

14-05-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మద్దతు ధర పెంపుపై ప్రధానికి రామన్నపేట లో పాలాభిషేకం

రామన్నపేట,

రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచిన సందర్భంగా రామన్నపేట పట్టణంలోని సుభాష్ సెంటర్‌లో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు.

ఈ సందర్భంగా నకిరేకల్ ఇన్‌చార్జ్ నకిరేకంటి మొగులయ్య, బండ మధుకర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు దుర్గయ్య మాట్లాడుతూ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులకు లాభసాటి వ్యవసాయం అందించేందుకు పసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డులు, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీలు, సోలార్ పంపుసెట్లకు 80 శాతం సబ్సిడీ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైస్ మిల్లర్లతో కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నష్టపరుస్తోందని ఆరోపించారు. రైతు వ్యతిరేక విధానాలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.

కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ సభ్యుడు వనం అంజయ్య, బీజేపీ నాయకులు డోగుపర్తి సుభాష్, కట్ట యాదయ్య, బీజేవైఎం జిల్లా కార్యదర్శి అక్కినపల్లి సైదులు, బెజ్జంకి శివకుమార్, బట్టే రమేష్, బతక్క నరేష్, రేపాక లింగస్వామి, గోపగోని అశోక్, రేఖ నరసింహ, పండుగ అశోక్, సురివి శేఖర్, ఏనూతుల సురేష్, చేరుకు గణేష్, మెడబోయిన కృష్ణ, అక్కెనపల్లి రాము, గొరిగే సైదులు, ఎర్రబోయిన వెంకటేష్, మెడబోయిన ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతుల కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News