Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:28 AM

రైతుకు అండగా ప్రభుత్వం. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు : విప్ వీరేశం

18-05-2026 174 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట : రైతులు తీసుకొచ్చే ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ విప్, వేముల వీరేశం హామీ ఇచ్చారు. రామన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు, మిల్లర్ల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం తూకం, రవాణా, హమాలి తదితర ప్రక్రియలను వేగవంతం చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు.

మిల్లర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు సహకరించాలని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల శ్రమకు తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని, రైతులకు చెల్లింపులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో తాసిల్దార్ లాల్ బహుదూర్, ఎంపీడీవో రాములు,

అధికారులు, ప్రజాప్రతినిధులు, మిల్లర్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతుకు అండగా ప్రభుత్వం. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు : విప్ వీరేశం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News