Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:09 PM

రైతు ముంగిట శాస్త్రవేత్తల సూచనలు

రైతు ముంగిట శాస్త్రవేత్తల సూచనలు

రైతు ముంగిట శాస్త్రవేత్తల సూచనలు
13-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సన్నరకాల వరి సాగుతో అధిక లాభాలు.. నానో యూరియా వినియోగంపై అవగాహన

చౌటుప్పల్ మండలంలోని రైతు వేదికలో బుధవారం “రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డా.ప్రభావతి పాల్గొని వచ్చే వానాకాలంలో సాగు చేసే ప్రధాన పంటల యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా వరిలో బీపీటీ –5204,ఆర్ఎన్ఆర్ –15048,కెఎన్ఎమ్–1638, డబ్ల్యుజిఎల్ –44 (సిద్ధి),హెచ్ ఎం టి సోనా, జైశ్రీరామ్ వంటి సన్నధాన్య రకాలను సాగు చేస్తే అధిక దిగుబడితో పాటు ప్రభుత్వం అందించే క్వింటాకు రూ.500 బోనస్ పొందవచ్చన్నారు. అలాగే ఎం టి యు –1010, కె ఎన్ ఎం –118 వంటి దొడ్డు రకాల సాగుతో గ్రేడ్–ఏ మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. యూరియా వినియోగాన్ని తగ్గించి నానో యూరియా వాడాలని, ఎకరాకు రెండు బస్తాలకు మించి యూరియా వేయొద్దని సూచించారు.వరి పంటలో కాండం తొలిచే పురుగు నివారణకు నాట్లు వేసే వారం రోజుల ముందు ఒక సెంట్ నారుమడికి 2 కిలోల కార్బోఫ్యూరాన్ 4జి గుళికలు వేయాలని తెలిపారు. అలాగే నాటు వేసిన 15 రోజులకు ఒకసారి పురుగుమందు పిచికారీ చేస్తే మొగి పురుగు నివారణ సాధ్యమవుతుందన్నారు. దోమపోటు నివారణకు కాళిబాటలు తప్పనిసరిగా తీయాలని సూచించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య మాట్లాడుతూ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు విత్తనాలు, ఎరువులు వినియోగించాలని రైతులకు సూచించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడితే సాగు ఖర్చు తగ్గి అధిక దిగుబడులు సాధ్యమవుతాయన్నారు.

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వైస్ చైర్మన్ చేన్నాగోని అంజయ్య శాస్త్ర వేత్తల సలహాలు, సూచనలు పాటించి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి,పొల్లేపల్లి లక్ష్మీ,రెడ్డి బావి సర్పంచ్ నందగిరి వెంకట్, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతు ముంగిట శాస్త్రవేత్తల సూచనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News