Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీఎంజేఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలకు కరపత్రికల ఆవిష్కరణ. ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 02:23 AM

రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..

రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..

రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..
26-03-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా ధర్నా, జె సి కి వినతిపత్రం అందజేత..

నల్లగొండ:జిల్లాలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. గురువారం నల్లగొండ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గడ్డం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని పెండింగ్‌లో ఉన్న బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఏప్రిల్ నెలలోనే వరి కోతలు ప్రారంభం కానున్నందున రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తుగానే ఐకేపీ (IKP) సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

​పెండింగ్‌లో ఉన్న బోనస్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని జిల్లాలో సాగు చేస్తున్న పామాయిల్ రైతుల ప్రయోజనం కోసం ఫ్యాక్టరీ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. అలాగే VB G RAM G పథకాన్ని క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, సెంట్రల్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ వీరెల్లి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదగోని శ్రీనివాస్ గౌడ్, భూ నిర్వాసితుల సెల్ కన్వీనర్ భవనం మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి, కోశాధికారి కన్మత రెడ్డి అశోక్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి, అధ్యక్షులు మిరియాల వెంకటేశం, నాయకులు బీపంగి జగ్జీవన్, పిండి పాపిరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ, సీనియర్ నాయకురాలు ఇరిగి చిలకమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.

Sthanikam

రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News