Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

రహదారి భద్రతే జీవితానికి రక్షణ

రహదారి భద్రతే జీవితానికి రక్షణ

రహదారి భద్రతే జీవితానికి రక్షణ
25-03-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వాహనదారులకు లయన్స్ క్లబ్ అవగాహన – ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి

రహదారిపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తన ప్రాణాలను కాపాడుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ అధ్యక్షుడు తిరందాసు జగన్నాథం సూచించారు. బుధవారం పురపాలక కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ ఆంజనేయులు, సైదిరెడ్డి పాల్గొని వాహనదారులకు పలు సూచనలు చేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి అని, నిర్ణీత వేగ పరిమితులను పాటించాలని తెలిపారు. మలుపుల వద్ద వేగం తగ్గించాలని సూచించారు. మద్యపానం చేసి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగం చేయరాదని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు, రవాణా శాఖలకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి ఎండి అతహర్ పాషా, కోశాధికారి సిలివేరు మంగయ్య, ట్రాఫిక్ కానిస్టేబుల్ జగన్, హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రహదారి భద్రతే జీవితానికి రక్షణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News