Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

రహదారి భద్రత వారోత్సవాల్లో జడ్.పి.హెచ్.ఎస్ నారాయణఖేడ్‌కు అవార్డుల పంట

23-01-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ :రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో నారాయణఖేడ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రహదారి భద్రత వారోత్సవాలలో జడ్.పి.హెచ్.ఎస్ నారాయణఖేడ్ పాఠశాల విద్యార్థులు వివిధ విభాగాల్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచి అవార్డుల పంట పండించారు.ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకున్నారు.పోటీల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో వైష్ణవి ప్రథమ స్థానం సాధించగా, ప్రహేళిక పోటీల్లో నవ్య శ్రీ, శ్రీశైలం విజేతలుగా నిలిచారు. అలాగే ముగ్గుల పోటీల్లో స్వప్న, ఐశ్వర్య ప్రతిభను చాటగా, చిత్రకళ పోటీల్లో సాయి చరణ్ బహుమతులు సాధించారు. విజేతలకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు, డీఎస్పీ వెంకటరెడ్డి తదితర ప్రముఖులు బహుమతులు అందజేశారు.అదేవిధంగా కార్యక్రమం ప్రారంభంలో ఏకదంతాయ నృత్య ప్రదర్శనను అద్భుతంగా ప్రదర్శించిన సహస్ర బృందం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నృత్య ప్రదర్శనకు అతిథులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషోర్, ఉపాధ్యాయులు రాజశేఖర్, చంద్రశేఖర్ ఆచార్య ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా రహదారి భద్రతపై విద్యార్థుల్లోనే కాకుండా ప్రజల్లోనూ అవగాహన పెరిగిందని నిర్వాహకులు తెలిపారు

Sthanikam

రహదారి భద్రత వారోత్సవాల్లో జడ్.పి.హెచ్.ఎస్ నారాయణఖేడ్‌కు అవార్డుల పంట

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News