Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:44 AM

రెండో విడత పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్ హనుమంతరావు

13-12-2025 168 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఐదు మండలాల్లో ఐదు ఆదర్శ పోలింగ్ కేంద్రాలు

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. భువనగిరి, వలిగొండ, బీబీనగర్‌, పోచంపల్లి, రామన్నపేట మండలాల్లో పోలింగ్‌ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామంలోని ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్‌ బయట అభ్యర్థుల గుర్తులతో కూడిన ఫారం–9ను తప్పనిసరిగా అతికించాలని, ఓటింగ్ కంపార్ట్మెంట్‌ను సక్రమంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పోలింగ్ ప్రక్రియను రేపు ఉదయం 7 గంటలకే ప్రారంభించాలన్నారు.

జిల్లాలో భువనగిరి మండలం అనంతారం, బీబీనగర్‌ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం, పోచంపల్లి మండలం జలాల్పూర్‌, వలిగొండ మండలం టేకుల సోమారం, రామన్నపేట మండలం నేర్నెముల గ్రామాల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు.

పోలింగ్ రోజున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు స్వేచ్ఛాయుతంగా, నిర్భయంగా ఓటింగ్‌లో పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్ డిఓ సురేష్ తాసిల్దార్ లాల్ బహుదూర్‌ ఆర్ ఐ శోభ, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి,జిపిఓ లక్ష్మీదేవి, గ్రామపంచాయతీ సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

రెండో విడత పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్ హనుమంతరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News