Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

రాయితీతో వ్యవసాయ యంత్రాలు వినియోగించుకోవాలి

06-01-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మానూర్ విస్తరణ అధికారి సంగమేష్

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ ఉపమిషన్ పథకం ద్వారా రాయితీపై అందిస్తున్న వ్యవసాయ పరికరాలను రైతులు పూర్తిగా వినియోగించుకోవాలని మనూర్ మండల విస్తరణ అధికారి సంగమేష్ సూచించారు. మంగళవారం స్థానిక రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద నేల దున్నే యంత్రాలు, పంటలకు మందులు పిచికారీ చేసే యంత్రాలు, విత్తనాలు–ఎరువులు ఒకేసారి వేయు పరికరాలు, గడ్డి కోసే యంత్రాలు, కలుపు తీయు పరికరాలు, నేల మెత్తబెట్టే పరికరాలు, చిన్న సాగు యంత్రాలు, నాగళ్లతో పాటు ఇతర అవసరమైన వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళా రైతులు, చిన్న మరియు సన్నకారు రైతులకు యాభై శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.దరఖాస్తు చేసుకునే రైతులు దరఖాస్తు పత్రం, ఆధార్ గుర్తింపు పత్రం నకలు, పట్టాదారు పాస్‌బుక్ నకలు, చక్రాల సాగు యంత్రాలకు సంబంధించిన పరికరాల కోసం వాహన నమోదు పత్రం నకలు, రెండు గుర్తింపు ఫోటోలు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. అర్హత కలిగిన రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Sthanikam

రాయితీతో వ్యవసాయ యంత్రాలు వినియోగించుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News