Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 02:09 AM

రైతుల నుంచి విద్యార్థుల వరకు ప్రభుత్వ నిర్లక్ష్యంపై బిఆర్ఎస్ నేత మచ్చేందర్ తీవ్ర విమర్శలు

రైతుల నుంచి విద్యార్థుల వరకు ప్రభుత్వ నిర్లక్ష్యంపై బిఆర్ఎస్ నేత మచ్చేందర్ తీవ్ర విమర్శలు

రైతుల నుంచి విద్యార్థుల వరకు ప్రభుత్వ నిర్లక్ష్యంపై బిఆర్ఎస్ నేత మచ్చేందర్ తీవ్ర విమర్శలు
January 04, 2026 07:19 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు, జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీలెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. యూరియా కోసం రైతాంగం కొట్టుమిట్టాడుతున్నా, వారి బాధలు పాలకులకు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కేసీఆర్ హయాంలో రైతులు ఇంట్లో కూర్చొని ఆటో ఛార్జీలు ఇచ్చి యూరియా తెప్పించుకునే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. నేడు యూరియా సెంటర్ల వద్ద రైతులు చెప్పుల లైన్లలో నిలబడి దర్శనమిస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితి గత కాంగ్రెస్ పాలన రోజులను గుర్తుకు తెస్తోందని ప్రజలు వాపోతున్నారని తెలిపారు.నీటిపారుదల అంశంపై కాంగ్రెస్ నాయకులు వెక్కిరింపుగా మాట్లాడుతున్నారని విమర్శించిన మచ్చేందర్, కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వల్లే రాష్ట్రం దేశంలో వరి ఉత్పత్తిలో మొదటి స్థానానికి చేరిందని గుర్తుచేశారు. అప్పటి కృషిని మరిచి నేడు విమర్శలు చేయడం సరికాదని అన్నారు.ఇటీవల నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్‌లో పది రోజులుగా కరెంటు, నీటి సదుపాయాలు లేకుండా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అరకూర భోజనం పెడుతూ విద్యార్థులను హింసిస్తున్నారని, దీనిపై ప్రశ్నించిన విద్యార్థులను బెదిరించిన వైనం అత్యంత దారుణమని పేర్కొన్నారు. బాధిత విద్యార్థులు రోడ్డెక్కితే, వార్డెన్ బెదిరింపులకు పాల్పడ్డ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ స్కూల్లు, నాణ్యమైన భోజనం అందిస్తామని చెప్పుకున్న ప్రభుత్వం, వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో కూడా సరైన భోజన సదుపాయాలు కల్పించలేకపోతోందని విమర్శించారు. విద్యారంగంపై ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.ఇక నారాయణఖేడ్ నియోజకవర్గంలో రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ దృష్టి సారించి ప్రజలకు మేలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ ప్రెస్ మీట్‌లో నాగంపల్లి గ్రామ సర్పంచ్ గంగుపటేల్, గౌడ్గావ్ గ్రామ సర్పంచ్ తనజీ పటేల్, సంగ్యం గ్రామ సర్పంచ్ ధర్మానాయక్, పోమ్యనాయక్ తండ సర్పంచ్ వెంకట్ నాయక్, మాజీ PACS చైర్మన్ గుఱ్ఱపు జలంధర్, కృష్ణాపూర్ మాజీ ఎంపీటీసీ అంజయ్య సాగర్, ర్యాలమడుగు మాజీ ఎంపీటీసీ అమ్ర్యనాయక్, కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, చీమలపాడ్ BRS సీనియర్ నాయకుడు బసవరాజు పటేల్, సీనియర్ నాయకుడు మోహన్రావ్ పటేల్, మార్డి బిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు కర్ణం రాజు, గుఱ్ఱపు బల్రాజు, గుఱ్ఱపు నర్సింలు, నివర్తి, దూదేకుల రఫీద్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News