Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:30 AM

రామన్నపేటలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

రామన్నపేటలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

రామన్నపేటలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
30-12-2025 228 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఉత్తర ద్వార దర్శనం

రామన్నపేట, స్థానికం ప్రతినిధి:

రామన్నపేట పట్టణంలోని ప్రసిద్ధ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆర్చనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణ రాధిక పాల్గొని లక్ష్మీ చెన్నకేశవ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణలు, గోవింద నామాలతో మార్మోగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు.

వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనంతో మోక్షప్రాప్తి కలుగుతుందన్న నమ్మకంతో భక్తులు అత్యంత భక్తిభావంతో పూజల్లో పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News