Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:39 AM

రామన్నపేటలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

రామన్నపేటలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

 రామన్నపేటలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
26-12-2025 255 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజాసేవే అసలైన రాజకీయాలు: సిపిఐ

రామన్నపేటలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం

రామన్నపేట స్థానికం ప్రతినిధి:

ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కంటే ప్రజల సమస్యలు పరిష్కరించడమే ముఖ్యమని సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ అన్నారు. సిపిఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట శుక్రవారం పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 1925 డిసెంబర్ 26న లక్నోలో సిపిఐ పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిపిఐ పనిచేస్తోందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినా ఆస్తులు కూడబెట్టకుండా ప్రజల కోసమే జీవించిన నాయకుల చరిత్ర సిపిఐదేనని తెలిపారు.

కేరళలో వామపక్ష పాలన దేశానికే ఆదర్శమని, నిజమైన రాజకీయాలంటే కమ్యూనిస్టులదేనని నేటి పరిస్థితులు నిరూపిస్తున్నాయని అన్నారు. సిపిఐ శతజయంతి ఉత్సవాల సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

రామన్నపేటలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News