Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:01 AM

రామన్నపేట రైల్వే బ్రిడ్జి వద్ద వర్షాకాల కష్టాలు – తాత్కాలిక చర్యలతోనే సరిపెడుతున్న రైల్వే అధికారులు

24-12-2025 337 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట రైల్వే బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్య – తాత్కాలిక చర్యలకే పరిమితమైన రైల్వే అధికారులు

రామన్నపేట స్థానికం ప్రతినిధి

హైదరాబాద్–నల్గొండ రైల్వే మార్గంలోని ట్రాక్ నెంబర్ 419 పరిధిలో రామన్నపేట నుంచి సిరిపురం వెళ్లే రైల్వే బ్రిడ్జి వద్ద వర్షాలు పడిన ప్రతిసారి భారీగా నీరు నిల్వ ఉండటంతో నెలల తరబడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహ రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, అధికారులు స్పందించి మోటర్లు ఏర్పాటు చేసి నిల్వ నీటిని తొలగిస్తూ తాత్కాలిక పరిష్కారానికి పరిమితమయ్యారు.

అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదని రామన్నపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మీర్జా ఫజల్ బేగ్ స్పష్టం చేశారు. వర్షాలు పడగానే సమస్య మళ్లీ యథావిధిగా ఉత్పన్నమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పైనుండి కిందికి వర్షపు నీరు జారకుండా సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రస్తుతం మోటర్ల ద్వారా నీరు తోడుతున్నప్పటికీ మళ్లీ ఊట వస్తున్న పరిస్థితి ఉన్నందున శాశ్వత మోటర్ల ఏర్పాటు అవసరమని డిమాండ్ చేశారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిష్కారాలు అమలు చేసి, వర్షాకాలంలోనూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షుడు బత్తుల సత్యం, రామన్నపేట పట్టణ శాఖ అధ్యక్షుడు దిండిగల్ల రాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట రైల్వే బ్రిడ్జి వద్ద వర్షాకాల కష్టాలు – తాత్కాలిక చర్యలతోనే సరిపెడుతున్న రైల్వే అధికారులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News