Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:31 AM

రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

03-01-2026 290 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట: స్థానికం ప్రతినిధి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటలో శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత విభాగం, సామాజిక శాస్త్రాల విభాగాలు, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1, యూనిట్–2ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

వేడుకల్లో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. రహత్ ఖానం మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి విద్యే మూలమని నమ్మి పాఠశాలలు స్థాపించి బాలికలకు విద్యాబుద్ధులు నేర్పిన సావిత్రిబాయి పూలే గొప్ప మహనీయురాలని అన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, పురుషులతో సమానంగా సమాజంలో గౌరవాన్ని దక్కించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. పి. వెంకటేశ్వరరావు, మహిళా సాధికారత విభాగం కోఆర్డినేటర్ డా. సునీత, అకడమిక్ కోఆర్డినేటర్ డా. జే. చిన్నబాబు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఎం. అనిత, టి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News