Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:35 PM

రామన్నపేట పాలకవర్గానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఘన సన్మానం

17-12-2025 237 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పాలకవర్గానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఘన సన్మానం

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజాభిమానంతో విజయం సాధించిన సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ… ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల మెరుగుదలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలని కోరారు. గ్రామ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.

కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామన్నపేట గ్రామ అభివృద్ధిలో కొత్త పాలకవర్గం కీలక పాత్ర పోషిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

రామన్నపేట పాలకవర్గానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News