Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:27 AM

రామన్నపేట డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

22-12-2025 126 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

రామానుజన్ జయంతికి అంకితంగా రామన్నపేట డిగ్రీ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 138వ జయంతిని పురస్కరించుకుని రామన్నపేటలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని గణిత విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ పి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిత్యజీవితంలో గణితం విడదీయరాని భాగమని పేర్కొన్నారు. అతి చిన్న వయసులోనే ప్రపంచ గణిత మేధావిగా గుర్తింపు పొందిన శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రానికి చేసిన సేవలు అపారమని ఆయన అన్నారు.

ఐక్యుఎసి కోఆర్డినేటర్ లక్ష్మీ నీలిమ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే గణితం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి గణితంపై పట్టు సాధించినప్పుడే అన్ని రంగాల్లో రాణించగలడని పేర్కొన్నారు.

గణిత విభాగాధిపతి చెనగోని వెంకట్ గౌడ్ మాట్లాడుతూ గణితంలో ప్రతిభ చూపినవారు ఇతర శాస్త్ర విభాగాల్లోనూ ముందుంటారని అన్నారు. వివిధ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షల్లో గణితం ప్రధాన అంశమని, అందువల్ల విద్యార్థులు గణితంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శ్రీనివాస రామానుజన్ ప్రతిపాదించిన అనేక గణిత సిద్ధాంతాలు నేటికీ పరిష్కారానికి అందని స్థితిలో ఉన్నాయంటే ఆయన మేధస్సు ఎంత గొప్పదో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల పరిపాలనాధికారి జి. కరుణాకర్‌తో పాటు అధ్యాపకులు జి. సునీత, తండు కృష్ణ కౌండిన్య, ఎం. అనిత, డి. కిషన్, ఎం. రవీందర్ రావు, రాచమళ్ళ శ్రీను, బి. అమరేందర్, ఎ. ఆంజనేయులు, జె. నరేశ్, జి. రాధిక, బి. రవి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

రామన్నపేట డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News