Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత పోలీసు శిక్షణకు ఎంపిక పరీక్ష.. సమయానికి చేరుకోవాలని ఎస్పీ సూచన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:18 PM

రాజకీయాల్లో నాయి బ్రాహ్మణులు ముందుండాలి

రాజకీయాల్లో నాయి బ్రాహ్మణులు ముందుండాలి

రాజకీయాల్లో నాయి బ్రాహ్మణులు ముందుండాలి
31-12-2025 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నాయి బ్రాహ్మణ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగభూషణం

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి

రాజకీయ సమీకరణాలలో నాయి బ్రాహ్మణులు ముందుండి ఉనికిని చాటాలని నాయి బ్రాహ్మణ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగభూషణం, పట్టణ అధ్యక్షులు లకుడాలం మాణిక్ ప్రభు, ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు యాదయ్యలు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నాయి బ్రాహ్మణ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు బుధవారం నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ కార్యాలయంలో ఆత్మీయ సన్మానం చేసి మాట్లాడారు. మనిషి పుట్టుక నుండి చావు వరకు ప్రతి పనిలో ముందుండే నాయి బ్రాహ్మణులు రాజకీయ రంగంలో మరింత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. నాటి కాలంలో నాయి లైన నందవంశ రాజులు రాజ్యాలను ఏలారని గుర్తు చేశారు. నిస్వార్థ ముఖ్యమంత్రిగా సేవలందించిన నాయి బ్రాహ్మణ కర్పూరి ఠాకూర్ స్ఫూర్తితో నాయిలందరూ రాజకీయంగా మరింత ఎదుగుదలకు కృషి చేయాలని సూచించారు. రాజకీయాలలో అనిచ్చితత్వం కొరబడటం రాజకీయ సమీకరణాల ఆవశ్యకతను సూచిస్తుందన్నారు. జిల్లాలో పోటీ చేసిన నాయి బ్రాహ్మణులు అందరూ గెలుపొందడం పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం మేరకు భవిష్యత్తు రాజకీయాల్లో నాయిలు ముందుంటారని సూచిస్తుందన్నారు. అవకాశం ఉన్న ప్రతి స్థానంలో రాజకీయంగా నాయి బ్రాహ్మణులు పోటీలో ఉండాలని సూచించారు. గెలుపొందిన నాయి బ్రాహ్మణ నాయకులు వృత్తిదారుల ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. సమాజంలో నాయిలు అస్పృశ్యతకు లోను కాకుండా మరింత సంఘటితం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివకాంతం, జిల్లా నాయకులు వీరన్న, సత్యం, ఆంజనేయులు, మురళి, ఉద్యోగ సంఘాల గౌరవ అధ్యక్షులు కిష్టయ్య, సుధామణి, పట్టణ గౌరవ అధ్యక్షులు దత్తాత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, సహాయ కార్యదర్శి మురళి, పెంటయ్య, స్వాగత్ ప్రభు, హనుమంతు, చరణ్, రాము, మండల అధ్యక్షులు, ఉపసర్పంచ్లు, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాజకీయాల్లో నాయి బ్రాహ్మణులు ముందుండాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News